ఈ చిట్కాలను ఉపయోగించండి

ఈ చిట్కాలను ఉపయోగించండి

అరటి పండు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీలు కూడా ఈ చిట్కాలను ఉపయోగించి సోషల్ మీడియాలో అందరితో పంచుకుంటున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు మరియు దీనిని ఇంటిలోనే తయారు చేసుకో వచ్చు.చాలా మంది అందంగా మారాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా మార్కెట్ లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి వాటి వలన అందంగా మారాలి అని అనుకుంటారు. అయితే మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ కి బదులుగా మనకి దొరికే వాటిని, మన ఇంట్లో వుండే వాటిని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా అందంగా మారచ్చు. పైగా దీని కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించక్కర్లేదు.మనం అరటిపండు తినేసి పడేసే తొక్క తో మనం మరింత అందంగా మారచ్చు. అలానే చాలా చర్మ సమస్యలు తొలగించుకోవచ్చు. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఒక లుక్ వేసేద్దాం.

కొద్ది రోజుల క్రితమే ఓ నటి చర్మానికి సంబంధించిన సమస్యలను, పిగ్మెంటేషన్ మరియు యాక్ని వంటివి తగ్గించుకోవడానికి చిన్న చిట్కాను అందరితో పంచుకున్నారు. అరటి పండు తొక్క లో సిలికా అనే కాంపౌండ్ ఉంటుంది. దాని వల్ల మన శరీరం లో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా ఉత్పత్తి అవడం వల్ల చర్మం మరింత ఆరోగ్యంగా మారుతుంది.ఇది ఇలా ఉంటే దీనిలో కొల్లాజెన్‌తో పాటు అరటి పండు తొక్కలో ఫినోలిక్స్ ఉంటాయి. దానిలో యాంటి మైక్రోబియల్‌కు సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే దీనిని ఈ విధంగా ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యి పిగ్మెంటేషన్ మరియు యాక్ని వంటి సమస్యలు తొలగించడానికి పని చేస్తుంది.

అలానే అరటి పండు తొక్కలో ఉండేటువంటి తెల్లని పొర తో చర్మం పై రుద్దండి. ఇలా ముఖమంతా కూడా ఆ అరటి తొక్కతో ముఖం పైన పదిహేను నిమిషాలు అలాగే రుద్ది ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి. అరటి పండు తొక్కలో అధికశాతం యాంటీ యాక్సిడెంట్స్ ఫైబర్ మరియు న్యూట్రియన్స్ ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది మరియు ముడతలు కూడా తగ్గుతాయి. ఇలా ఉపయోగించడం వల్ల చర్మం కూడా పొడిబారకుండా ఉంటుంది. మీరు దీనిని ఇంతకు ముందెప్పుడూ ప్రయత్నించక పోతే తప్పకుండా ప్రయత్నించండి.

చూశారు కదా అరటి పండు తొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అందుకనే తొక్కే కదా అని తీసిపారేయకుండా ఈ విధంగా అనుసరిస్తే మరింత అందంగా మారచ్చు. కనుక మర్చిపోకుండా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఈ చిట్కాని ఫాలో అవ్వండి దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. కెమికల్స్ వంటివి ఉండవు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మీకు కలగవు. యాక్నితో బాధ పడే వాళ్లకు ఇది చాలా మంచి టిప్. కాబట్టి యాక్ని ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అయితే చక్కటి ఫలితం పొందవచ్చు.