పెట్రోల్ ధర స్థిరంగా ఉంది

పెట్రోల్ ధర స్థిరంగా ఉంది

దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగాయి. రేట్లలో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు వరుసగా నాలుగో రోజు కూడా స్థిరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే.. వాహనదారులకు మరింత ఊరట కలుగనుంది.

హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేటు లీటరుకు రూ.110.67 వద్దనే స్థిరంగా ఉంది. మార్పు లేదు. డీజిల్ రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ.96.08 వద్దనే ఉంది.

అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లను గమనిస్తే.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.116.34 వద్ద ఉంది. అదేసమయంలో అండమాన్ నికోబర్‌లో పెట్రోల్ ధర రూ.82 వద్ద కొనసాగుతోంది. అంటే ఇక్కడ పెట్రోల్ ధర రూ.34 తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డీజిల్ కూడా రూ.23 తక్కువకే వస్తోంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.25 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ధర 82.35 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 2.99 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 81.17 డాలర్లకు ఎగసింది.