మెట్రో స్టేషన్ గోడల మీద పగుళ్లు

మెట్రో స్టేషన్ గోడల మీద పగుళ్లు

మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికుల్నిమరోసారి భయపెడుతున్నాయి. తాజాగా మూసాపేటలోని మెట్రో స్టేషన్‌ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే.