బూమ్రాను క‌ల‌వలేక‌పోయానన్న విషాదంతో తాత ఆత్మ‌హత్య 

Cricketer Jaspreet Bumrah’s grandfather goes missing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ధ‌ర్మ‌శాల‌లో శ్రీలంక‌తో తొలి వ‌న్డే ఆడుతున్న టీమిండియా ప్ర‌ధాన‌ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా కుటుంబంలో విషాదం నెల‌కొంది. రెండు రోజుల క్రితం అదృశ్య‌మ‌యిన బుమ్రా తాత సంతోక్ సింగ్ స‌బ‌ర్మ‌తీ న‌దిలో శ‌వ‌మై తేలారు. 84 ఏళ్ల సంతోక్ సింగ్…మ‌న‌వడు బుమ్రాను చూడ‌లేక‌పోయాన‌న్న విషాదంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డిసెంబ‌రు 6న బుమ్రా పుట్టిన‌రోజు కావ‌డంతో…మ‌న‌వ‌డిని చూసేందుకు సంతోక్ సింగ్ జార్ఖండ్ నుంచి అహ్మ‌దాబాద్ వ‌చ్చారు. అయితే సంతోక్ సింగ్ బుమ్రాను క‌లిసేందుకు అత‌ని త‌ల్లి ద‌ల్జీత్ కౌర్ ఒప్పుకోలేదు. దీంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపానికి గురయ్యారు. రెండు రోజుల అనంత‌రం పెద్ద కుమారుడు బ‌ల్వీంద‌ర్ సింగ్ కు ఫోన్ చేసి చ‌నిపోయిన తన భార్య వ‌ద్ద‌కు వెళ్తున్నాన‌ని చెప్పి ఫోన్ పెట్టేశారు. అప్ప‌టినుంచి ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. స‌బ‌ర్మ‌తి న‌దిలో ఆయ‌న మృత‌దేహాన్ని అహ్మ‌దాబాద్ ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసెస్ అధికారులు గుర్తించారు. సంతోక్ సింగ్ ఒక‌ప్పుడు వ్యాపార వేత్త‌.

వ్యాపారంలో నష్టాలు రావ‌డంతో ఆయ‌న ఆర్థికంగా దెబ్బ‌తిన్నారు. బుమ్రా తండ్రి చ‌నిపోవ‌డంతో సంతోక్ సింగ్  జార్ఖండ్ లోని పెద్ద కుమారుడు బ‌ల్వీంద‌ర్ సింగ్ వ‌ద్ద ఉంటున్నారు. ఆటో న‌డుపుకుంటూ జీవ‌నోపాధి పొందుతున్నారు. నిజానికి సంతోక్ సింగ్ బుమ్రాకు సొంత తాతే అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య సంబంధాలు అంతంత‌మాత్రంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. 2001లో  బుమ్రా తండ్రి జ‌స్విర్ సింగ్ మ‌ర‌ణించిన త‌రువాత‌. కుటుంబంలో తీవ్ర విభేదాలు వ‌చ్చి విడిపోయిన‌ట్టు స‌మాచారం. అయితే దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ…సంతోక్ సింగ్ మ‌న‌వ‌డు బుమ్రా ఎదుగుద‌ల చూసి చాలా మురిసిపోయేవార‌ని, అతను ఆడే మ్యాచ్ ల‌ను టీవీలో క్ర‌మం త‌ప్ప‌కుండా చూసేవార‌ని తెలుస్తోంది. చ‌నిపోయే లోపే ఒక్క‌సారి మ‌న‌వణ్ని క‌ల‌వాల‌న్న‌ది సంతోక్ కోరిక‌. అందుకోస‌మే మ‌న‌వడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌ను నివ‌సించే అహ్మ‌దాబాద్ కు వెళ్లారు. కానీ బుమ్రా త‌ల్లి ఒప్పుకోక‌పోవ‌డంతో…ఆఖ‌రి కోరిక తీర‌కుండానే క‌న్నుమూశారు.