చరణ్ యాక్షన్ సీక్వెన్స్ కి డేట్ ఖరారు..

Game Changer
Game Changer

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోనుంది. జులై 11 నుంచి జరిగే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.