‘పుష్ప 2’లో మరో అతిథి పాత్ర ?

Pushpa the tollywood movie
Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం ” పుష్ప “ది రైస్ ‘ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా “పుష్ప” 2 పై కూడా ఓ క్రేజ్ అప్డేట్ అయితే వినిపిస్తోంది. పుష్ప 2 లో ఇప్పుడు మరో స్టార్ హీరో అతిథిగా ఒక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ పాత్రలో నటిస్తున్నాడు అంటూ కొత్తగా పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఒకవేళ ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. ఈ మూవీ పుష్ప 1 ల ఉండబోతోందా లేక కొత్తగా ఏమైనా ఉండబోతోందో చూడాలి అని అంటున్నారు అభిమానులు . ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయి. ఇంతకీ, అక్షయ్ కుమార్ పుష్ప 2 లో ఏ పాత్రలో కనిపిస్తున్నాడో చూడాలి. అన్నట్టు ఈ చిత్రంలో రష్మికా మందన్నా చేస్తున్న శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అంటూ ఆ మధ్య ఓ పిక్ లీక్ అయితే వైరల్ అయ్యింది. మొత్తమ్మీద పుష్ప 2 పై రోజు రోజుకు బాగా రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.