జపాన్ లో రికార్డ్ సృష్టించిన “రంగస్థలం”చిట్టిబాబు..

Ram Charan
Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ,సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “రంగస్థలం” 2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ఘన విజయం సొంతం చేసుకుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మాస్ యాక్షన్ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ బ్రిలియెన్స్, చిట్టిబాబుగా చరణ్ అద్భుతంగా నటించడం,ఇందులో చిట్టిబాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది .అత్యున్నత సాంకేతిక విలువలు రంగస్థలం సినిమాని టాలీవుడ్‌లో బిగ్ హిట్‌గా మార్చాయి. కాగా ఈ మూవీ తాజాగా జపాన్‌లో విడుదలైంది.

అయితే విషయం ఏమిటంటే, 2023లో జపాన్‌లో రిలీజ్ అయిన భారతీయ చిత్రాలలో రంగస్థలం అత్యంత భారీ ఓపెనింగ్ లభించింది అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది రంగస్థలం. జపాన్ లో ఇటీవల రిలీజ్ అయినా మగధీర అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. అలానే రామ్ చరణ్‌కు జపాన్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు అదే రంగస్థలం కి అద్భుతమైన ఓపెనింగ్స్‌ తెచ్చిపెట్టింది. కాగా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, రంగస్థలం సినిమా కెజిఎఫ్ తో పాటు అక్కడ విడుదల కావడం విశేషం. అయితే చరణ్ మరి భవిష్యత్తులో జపాన్ బాక్సాఫీస్ వద్ద రంగస్థలం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూద్దాం.