హిట్ 2 దర్శకుడి “మ్యాక్స్” ఇకలేదు.

Adavi sesu
Adavi sesu

అడవి శేషు హీరో గా వచ్చిన హిట్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్టి, హిట్ సినిమా ఘన విజయం సాధించింది . గతం లో విష్వక్సేన్, అడివి శేష్ హీరోలుగా హిట్ చిత్రం తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్‌ కొలను. ఇప్పటికే రెండు క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ముఖ్యంగా అడివి శేష్ హీరోగా హిట్‌ 2 మంచి వసూళ్లను కూడా రాబట్టింది. హిట్ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాక్స్ (డాగ్‌) ప్రాణాలు విడిచింది. తను మాక్స్ తో దిగిన ఫొటోను షేర్ చేసి ,ఈ విషయాన్ని శైలేష్ కొలను తెలిపాడు.
‘బరువెక్కిన హృదయంతో ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నా. మా ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయింది. మాక్స్‌ పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. క్రూరమైన జాతి అయినప్పటికీ.. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన మనసుల్లో ఇది ఒకటి. ఆఫీసర్ మాక్స్‌ మేమంతా నిన్ను మిస్సవుతున్నాం. మాక్స్‌ , హిట్ 2 సినిమా లో కీలక పాత్రా పోషించింది కాబట్టే అంత బాగా వచ్చింది ’ అని శైలేష్ ట్వీట్ చేశారు. న్యాచురల్‌ స్టార్ నానితో హిట్‌3 , హిట్ కు సీక్వెల్ గా ఉండబోతుందని శైలేష్‌ కొలను ఇప్పటికే ప్రకటించారు.