ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ స‌క్సెస్ పార్టీ…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

deepika-alia

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో 50మిలియ‌న్ల‌కు పైగా… వ్యూస్ సాధించింది. చిత్రంలోని ఘూమర్ పాటకు కూడా ఇదే స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్బంగా ప‌ద్మావ‌తి హీరోయిన్ దీపికా ప‌దుకునే… బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఓ పెద్ద పార్టీ ఎరేంజ్ చేశారు. ముంబైలోని త‌న ఇంట్లో దీపిక ఈ పార్టీ ఇస్తున్నారు.

padmavati-trailer

ప‌ద్మావ‌తి న‌టులు ర‌ణ్ వీర్ సింగ్, షాహిద్ క‌పూర్, ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో పాటు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, క‌ర‌ణ్ జోహార్, అలియా భ‌ట్, సిద్దార్ధ మ‌ల్హోత్రా, ఆదిత్యారాయ్ క‌పూర్, నిర్మాత క‌పిల్ చోప్రా, ద‌ర్శ‌కుడు అభ‌య్ చోప్రా హాజ‌రు కానున్నారు. ప‌ద్మావ‌తి సినిమా కోసం దీపిక చాలా క‌ష్ట‌ప‌డ్డారు. చిత్తోర్ రాణి ప‌ద్మినిలా క‌నిపించ‌డానికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప‌ద్మావ‌తికే త‌ల‌మానికంగా భావిస్తున్న ఘూమ‌ర్ పాట కోసం ఘూమ‌ర్ నృత్యంలో శిక్ష‌ణ తీసుకున్నారు. ఘూమ‌ర్ లో దీపికా నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న అద్భుతంగా ఉంద‌న్న ప్ర‌శంస‌లు వెలువడుతున్నాయి. ఈ నృత్యం చూసి అనేక‌మంది త‌న‌ను అభినందిస్తున్నార‌ని దీపిక చెప్పారు.