శ‌త‌మానం భ‌వ‌తి ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా

ntr next movie with Satish Vegesna.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జై ల‌వ‌కుశ త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఇంకా రెండు నెల‌ల స‌మ‌య‌ముంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాతో త్రివిక్ర‌మ్ బిజీగా ఉండ‌డంతో పాటు ఎన్టీఆర్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా స‌న్న‌ద్ధ‌మ‌వ‌డానికి ఈ గ‌డువు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాకు అవ‌స‌ర‌మైన లుక్ ట్రై చేస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప‌నిలో ప‌నిగా..తదుప‌రి సినిమాకు సంబంధించి కొన్ని క‌థ‌లు కూడా విన్నారు. వాటిల్లో శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న చెప్పిన క‌థ ఎన్టీఆర్ కు బాగా న‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Satish-Vegesna-ext-movie-wi

ఈ క‌థ‌కు ఎన్టీఆర్ కొన్ని మార్పుల‌ను సూచించార‌ని, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు త‌గ్గ‌ట్టుగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ని పిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. శ‌త‌మానం భ‌వ‌తిలానే ఇది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ద‌గ్గ‌ర‌య్యే క‌థ అని భావిస్తున్నారు. సినిమాకు శ్రీనివాస క‌ళ్యాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బృందావ‌నం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ద‌గ్గ‌రైన ఎన్టీఆర్ తో ఆ త‌ర‌హాలోనే మ‌రో కుటుంబ క‌థాచిత్రం తీయాల‌ని దిల్ రాజు ఎప్ప‌టినుంచో ప్లాన్ చేస్తున్నారు. అందుకు త‌గిన క‌థ‌ను స‌తీశ్ వేగ్నేశ్ సిద్ధం చేశారు. స‌తీశ్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా దిల్ రాజ్ ప్రొడ‌క్ష‌న్ లోనే తెర‌కెక్కింది.