రామోజీ మూడ్ మార్చిన ABN రాధాకృష్ణ.

ramoji rao Change Eenadu website system because of Radhakrishna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈనాడు సహా దేశీయంగా ఫుల్ ఫామ్ లో వున్న దినపత్రికలన్నీ గడిచిన రెండుమూడేళ్ళలో ఎన్నోసార్లు తమ సర్క్యులేషన్ పెరిగినట్టు చెప్పుకున్నాయి. అంతే కాదు. ఎంత ఇంటర్నెట్ వచ్చినా, డిజిటల్ మీడియా ఒరవడి మొదలైనా ఇంకా ప్రింట్ ప్రాముఖ్యత తగ్గలేదని చెప్పుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ పత్రికలు తమ ప్రింటింగ్ ఆపేసి నెట్ ఎడిషన్స్ కి మాత్రమే పరిమితం అవుతున్న సందర్భంలోనూ ఈనాడు లాంటి పత్రికలు మాత్రమే కాకుండా సమాచార, ప్రసార శాఖ సైతం ఇదే పద్ధతి కొనసాగిస్తోంది. అయితే అదంతా పెను ఉధృతికి ఇసుక, మట్టి తో ఆనకట్ట వేసినట్టే అని తొందర్లోనే అర్ధం అయిపోయింది. మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలని ఈనాడు సంస్థల అధినేత రామోజీ కూడా నిర్ణయించుకున్నారు. అయితే దానికి కారణం మాత్రం abn రాధాకృష్ణ అని సమాచారం.

Eenadu-Ramoji-Rao

1974 లో ఈనాడు ఆవిర్భవించాక తెలుగు జర్నలిజం లో అంచెలంచెలుగా ఎదిగిన ఆ పత్రిక కి కొన్ని పత్రికలు, కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి పోటీ ఇవ్వగలిగాయే తప్ప దాన్ని ఏ దశలోనూ అధిగమించలేకపోయాయి. ఈనాడు కి వున్న ఆ ప్రతిష్టని తొలిసారిగా ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ రూపంలో దెబ్బ తీసింది. ఈనాడు వెబ్ సైట్ ని ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ అలెక్స రాంక్ ప్రకారం దాటి పోవడమే కాకుండా నిలకడగా అక్కడే ఉండిపోయింది. ఇక అప్పటినుంచి జర్నలిజం లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రామోజీ సీరియస్ గా పరిశీలించడం మొదలెట్టడమే కాదు. అవసరమైన మార్పులు చేయడానికి కూడా సై అన్నారు. అందులో భాగంగా వున్న వెబ్ సైట్ ని పటిష్టం చేయడంతో పాటు మోజో ( మొబైల్ జర్నలిజం ) ఆధారిత నెట్ వర్క్, వెబ్ ఛానల్ సహా ఇంకొన్ని సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కీలక సిబ్బంది నియామక ప్రక్రియ సైతం రామోజీ కనుసన్నల్లో నడిపిస్తున్నారు.

ABN Radhakrishna

ఈ సరికొత్త ఒరవడికి ఒకప్పుడు ఈనాడు ప్రతిష్ట పెంచడానికి దోహదపడ్డ సితార, విపుల, చతుర వంటి పత్రికల అస్తిత్వం ప్రమాదంలో పడింది. వాటిని ప్రింట్ వేయడమే కానీ కొనేవారు లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పత్రికల ప్రింటింగ్ ఆపేసి కేవలం నెట్ ఎడిషన్ కి పరిమితం కావాలన్న ఆలోచన చేస్తోంది ఈనాడు యాజమాన్యం. ఈ విషయం జర్నలిజం రంగంలో ఇప్పుడు హాట్ టాపిక్. అయితే చిత్రం ఏమిటంటే ఈనాడు లో ఆత్మశోధనకి, వారి ఆలోచనల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు తన ప్రింటింగ్ టెక్నాలజీ ని ఆధునికీకరించడానికి పూనుకోవడం. ఒకప్పుడు ఈ లోపం వల్లే ఆంధ్రజ్యోతి వెనుకబడిందని రాధాకృష్ణ భావించి ఉండొచ్చు. కానీ సరికొత్త మార్పులు వస్తుంటే దాన్ని వదిలేసి పాత పద్ధతులకు చిత్రిక పట్టడం అవసరమా ?. ఈ వ్యవహారం చూస్తుంటే రామోజీలో మార్పు తెచ్చిన రాధాకృష్ణ తాను వెనక్కి వెళుతున్నాడేమో ఆలోచించుకోవాలి.