దీపిక‌, ర‌ణ్ వీర్ ల పెళ్లి ఎప్పుడంటే…?

deepika padukone ranveer singh marriage date details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత విజ‌య‌వంత‌మైన హీరోయిన్ గా కెరీర్ కొన‌సాగిస్తున్న దీపికా ప‌దుకునే పెళ్లిపై మ‌ళ్లీ వార్త‌లొస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రేమిస్తున్న ర‌ణ్ వీర్ సింగ్ ను ఆమె త్వ‌రలోనే పెళ్లిచేసుకోబోతోందని బీ టౌన్ వ‌ర్గాలంటున్నాయి. వివాదాస్ప‌ద సినిమా ప‌ద్మావ‌త్ త‌ర్వాత వారిద్ద‌రి పెళ్లిపై వరుస‌గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ సారి వినిపిస్తున్న వార్త‌లు మాత్రం నిజ‌మేనంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు… బెంగ‌ళూరు నుంచి దీపిక త‌ల్లిదండ్రులు ముంబై వ‌చ్చి ర‌ణ్ వీర్ త‌ల్లిదండ్రుల‌తో చర్చించిన‌ట్టు స‌మాచారం. పెళ్లి మాట‌లు పూర్త‌యిన త‌ర్వాత స‌ర‌దాగా అంద‌రూ క‌లిసి ముంబైలోని ఫోర్ సీజ‌న్స్ హోట‌ల్ లో డిన్న‌ర్ కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ లాగా దీపిక‌, ర‌ణ్ వీర్ కూడా విదేశాల్లో పెళ్లిచేసుకోవాల‌ని అనుకున్నా… అందుకు… ర‌ణ్ వీర్ త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేద‌ని, బంధువులంతా ముంబైలోనే ఉండ‌డంతో పెళ్లి ముంబైలోనే జ‌ర‌గాల‌న్న‌ది వారి కోరిక‌ని తెలుస్తోంది. దీంతో ముంబ‌యిలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్, ఫోర్ సీజ‌న్స్, సెయింట్ రెగిస్ హోట‌ళ్లలో ఏదో ఒక‌దాంట్లో వివాహం జ‌రిపించాల‌ని రెండు కుటుంబాలు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రో మూడు నెల‌ల్లో వివాహం జ‌రిగే అవ‌కాశ‌ముంది. దక్షిణ భార‌త‌దేశ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహవేడుక జ‌రిపించిన త‌రువాత‌… ప్ర‌ముఖులు, స‌న్నిహితులు, స్నేహితుల‌కు గ్రాండ్ గా విందు ఏర్పాట్లు చేయ‌నున్నారు. ర‌ణ్ వీర్ గ‌ల్లీబాయ్ చిత్రంతో బిజీగా ఉండ‌డంతో దీపిక‌… అత‌ని త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి లండ‌న్ లో పెళ్లి షాపింగ్ చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.