ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 12వందల ఇండ్లు ఆహుతి..

ఘోర అగ్నిప్రమాదం ... 23 మంది మృతి 

దేశ రాజధాని ఢిల్లీ తుగ్లకాబాద్‌ మురికివాడలో భారీగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమారు వెయ్యి నుంచి 12 వందల ఇండ్లు అగ్నికి ఆహుతి కావడంతో స్థానిక ప్రజలు అయోమయానికి గురి కావడమే కాకుండా తీవ్ర భయాందోళనతో వణికిపోయారు.

అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఒంటిగంటకు తుగ్లకాబాద్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్‌ మీనా వెల్లడించారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదని ప్రసాద్ మీనా స్పష్టం చేశారు.