విషపు గాలి పీలుసున్న డిల్లీ వాసులు

విషపు గాలి పీలుసున్న డిల్లీ వాసులు

గత ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020 వెల్లడించింది. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు. అమెరికాకి చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఈ నివేదిక రూపొందించింది.

ప్రధానంగా పసిపిల్లలపై ఈ కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అధ్యయనం చేసింది. చిన్న పిల్లల మీద ఈ స్థాయిలో వాయుకాలుష్యం ప్రభావం చూపించడం అత్యంత దారుణమైన అంశమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ కల్పన బాలకృష్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అరికట్టగలిగే మరణాలేనన్న కల్పన ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలన్నారు.

గాలిలో కాలుష్యకారకమైన సూక్షా్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్‌ ఎయిర్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.