జైలుని డేరాగా మార్చిన గుర్మీత్

dera-baba-police-security-guards-overaction-in-dera-baba-jail

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇద్దరు సాధ్విలను రేప్ చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్.. జైల్లో కూడా అందర్నీ ఇబ్బందిపెడుతున్నారు. రోహ్ తక్ లోని సునారియా జైల్లో ఉన్న ఆయన.. తన తోటి ఖైదీలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈయన జైల్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి.. అక్కడ ప్రశాంతంగా ఉన్న ఖైదీలకు మనశ్సాంతి కరవైంది. జైలు అధికారులు ఏ పని చేసినా గుర్మీత్ నే దృష్టిలో పెట్టుకోవడం వారికి నచ్చడం లేదు.

నిజానికి జైల్లో అందరూ ఒకటే. కానీ అధికారులు మాత్రం గుర్మీత్ కు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. గుర్మీత్ కు భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు.. తోటి ఖైదీలపై మాత్రం తీవ్రమైన ఆంక్షలు పెడుతున్నారు. గుర్మీత్ బయటకు రావాల్సి వస్తే.. అందర్నీ బ్యారెక్స్ లోకి నెట్టేస్తున్నారు. కనీసం బంధువుల్ని కలవడానికి కూడా అనుమతించకపోవడంతో.. ఖైదీల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

గుర్మీత్ ను వేరే జైలుకు తరలించాలని సునారియా ఖైదీలు కోరుకుంటున్నారు. బాబాకు సెక్యూరిటీ పేరుతో పోలీసులు అతి చేస్తున్నారని. తమ హక్కులు హరిస్తున్నారనేది ఖైదీల ఆవేదన. వారి వాదనలో నిజం ఉన్నా.. బాబాను సెపరేట్ జైల్లో ఉంచడం కుదరదనేది అధికారుల మాట. మరి పరిస్థితి విషమించకముందే హర్యానా సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

డేరా బాబా సీక్రెట్స్ మీరూ చూస్తారా ?

బాబుకి కామన్ సెన్స్ లేదా ?

విజయవాడ కి కెసిఆర్… ఎందుకంటే?