మరో ట్విస్ట్…బీజేపీకి దేవెగౌడ పెద్దకొడుకు రేవణ్ణ సపోర్ట్ !

Deve Gowda Elder son Revanna supporting on bjp party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజుల నుండీ కేవలం దక్షిణాదినే కాక దేశం మొత్తాన్ని తీవ్ర ఉత్కంఠతో ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కక పోవడంతో జేడీఎస్‌ ఇప్పుడు కింగ్‌ అవుతోంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయాలకు శర వేగంగా మారుతున్నాయి. క్షణానికో కొత్త వార్త వచ్చి జనాలను ఉత్కంఠకు గురి చేస్తోంది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు నిరాశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతోన్న విషయంపై బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప స్పందించారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ… ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సి ఉందని, తాము అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు.

అయితే యడ్యూరప్ప వ్యాఖ్యల వెనుక దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ ఉన్నాడని బీజేపీ నేతల్లో అంతర్గత చర్చ నడుస్తోందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీకి దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. తన వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమంటూ బీజేపీకి రేవణ్ణ ఇప్పటికే భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ నిజమో కాదో నిరూపణ కాని వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే… బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పొచ్చు.