త్రిమూర్తులు తోవ చూసుకున్నారా..?

Dhadi veerabhadrao took his chance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉత్తరాంధ్రకు ఏఫీ రాజకీయాల్లో పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడ సాధారణంగా జనం ఓ పార్టీనే ఆదరిస్తారనే భావన ఉంది. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీకి అధికారం దక్కుతూ వచ్చింది. ఎవర్ని గెలిపించినా వారికి భారీగా సీట్లు కట్టబెట్టడం ఉత్తరాంధ్ర సంప్రదాయం. అలాంటి ఉత్తరాంధ్రలో ముగ్గురు సీనియర్ల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముందుగా దాడి వీరభద్రరావు గురించి చెప్పుకోవాలి. ఈయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అక్కడా రాజీనామా చేశారు. కానీ కుమారుడి భవిష్యత్తు కోసం ఏదో పార్టీలో చేరాలనుకుంటున్నారు. టీడీపీతో బేరాలు చేస్తున్నారనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు వైసీపీ కూడా దాడిని వదిలేసి, ఆయన కొడుక్కి గాలం వేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ సీటు దాడి రత్నాకర్ కు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. అదే జరిగితే దాడి మళ్లీ వైసీపీ గూటికే చేరతారనేది టీడీపీ వర్గాల అంచనా. దాడి మళ్లీ వైసీపీలోకి వెళ్తే.. ఎందుకు రిజైన్ చేశారు, ఎందుకు చేరారనే విషయం చెప్పాలిగా మరి. ఈ వీక్ పాయింట్ మీదే బలమైన దెబ్బకొట్టాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇక కొణతాల కూడా త్వరలో ఏదో పార్టీలో చేరతారట. కానీ సబ్బం హరి విషయం మాత్రం ఇంకా ఏమీ తేలలేదు.