ధోనీకి జీవా బర్త్ డే విషెస్ ఎలా చెప్పిందో చూశారా !

Dhoni Daughter Ziva birthday wishes

భారత క్రికెట్‌లో సంచనాలకు మారుపేరు మహేంద్ర సింగ్‌ ధోని. ఎక్కడో ఝార్ఖండ్లో టికెట్ కలెక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన ధోనీ అత్యంత ప్రతిష్టాత్మక భారత క్రికెట్ టీం కెప్టన్ గా తన సేవలు అందించాడు. నేటితో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాడు ధోని. ధోని పుట్టిన రోజు సందర్భంగా టీం సభ్యులు అతని బర్త్ డే వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా బీసీసీఐ కూడా ధోనీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. టీమిండియా క్రికెటర్లందరితోపాటు ధోనీ ముద్దుల కూతురు జీవాతో ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియో ఒకటి బీసీసీఐ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య, సురేశ్‌ రైనా, కేఎల్‌. రాహుల్‌, జీవా తదితరులు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటే వీరందరిలో జీవా చెప్పిన విధానం వీడియోకే హైలైట్‌గా నిలిచింది. ధోనీ కూతురు జీవాతో బీసీసీఐ ప్రత్యేకంగా విషెస్‌ చెప్పించింది. ఈ వీడియోలో ‘హ్యాపీ బర్త్‌ డే పాపా..యూ ఆర్‌ గెటింగ్‌ ఓల్డ్‌’ అని పాట పాడుతూ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది.