ధోనీ రీఎంట్రీ

ధోనీ రీఎంట్రీ

దాదాపు నాలుగు నెలలు క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ రీఎంట్రీ డిసెంబరులో ఇవ్వనున్నాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉన్న ధోనీ వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌ కోసం మళ్లీ జట్టులోకి డిసెంబర్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు.టీమిండియా భారత్గడ్డపై వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడువన్డేల సిరీస్ డిసెంబరు 6నుండి ఆడబోతుంది. బీసీసీఐ ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్ రూపొందించి మ్యాచ్ వేదికలని కూడా ఖరారు చేసినట్టు సమాచారం.

ఝార్ఖండ్‌లోని రాంచీ క్రికెట్ స్టేడియంలో ధోనీ కూడా ప్రాక్టీస్ మొదలెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ ప్రాక్టీస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తున్న సెలక్టర్లు ధోనీని పూర్తిగా వరల్డ్‌ కప్ తర్వాత పక్కనపెట్టేసారు