స్పైస్ జెట్ విమానంలో చిన్నారి మృతి

స్పైస్ జెట్ విమానంలో చిన్నారి మృతి

ప్రీతి జిందాల్ అనే మహిళ తన నాలుగు నెలల కూతురు రియా జైపూర్ నుంచి ముంబై వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించారు. నాలుగు నెలల చిన్నారి రియా ఇంకా అత్తా మామలతో ప్రీతి జిందాల్ సూరత్ నుంచి ముంబై బయలు దేరింది.

ఉదయం సమయంలో విమానం ఎక్కగా కాసేపు అయ్యాక తల్లి ప్రీతి జిందాల్ కూతురు రియాకి పాలిచ్చి పడుకోబెట్టింది. పాపలో చలనం లేక పోవడంతో విమానం దిగే సమయంలో విమాన సిబ్బందికి ప్రీతి జిందాల్ సమాచారం ఇవ్వగా అప్పటికే పాప మృతి చెందింది. విమానాశ్రయం చేరుకున్న తరువాత పాపను నానావతి ఆస్పత్రికి తరలించారు. కానీ పాప అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించగా  చని పోవడానికి కారణం తెలువలేదు.