షుగర్ వ్యాధి లక్షణాలు

షుగర్ వ్యాధి లక్షణాలు

డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం, నీరసం, అలసట, ఇరిటేషన్ కలగడం ఇలాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అదే విధంగా కేవలం ఇవి మాత్రమే కాకుండా చాల రకాల లక్షణాలని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోటి ద్వారా మనం మూడు రకాల లక్షణాలను గుర్తించ వచ్చని దీని వల్ల డయాబెటిస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అని అంటున్నారు.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌కి ఓరల్ హెల్త్‌కి మధ్య లింక్ ఉందని అంటున్నారు. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడే వారిలో మనం ఈ లక్షణాలను గుర్తించవచ్చు. మరి వాటి కోసం ఎటువంటి ఆలస్యం చేయకుండా చూసేద్దాం.

టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ కానీ వస్తే నోరు ఆరిపోవడం ఒక లక్షణం అని వైద్యులు అంటున్నారు. ఎప్పుడూ కూడా నోరు ఆరిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు, దీనితో మనం డయాబెటిస్ అని గుర్తించ వచ్చు అని అంటున్నారు. అయితే ఎందుకు ఇలా కలుగుతుంది అనేది తెలియలేదు. కానీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది ఒక లక్షణమని.. దీని ద్వారా డయాబెటిస్ ఉందని చెప్పొచ్చు అని అన్నారు.

ఇది ఇలా ఉంటే నోరు ఆరిపోవడంతో పాటుగా నాలిక పొడిబారిపోవడం, నోట్లో మాయిశ్చర్ తక్కువగా ఉండడం, పెదవులు పగిలిపోవడం వుంటాయని అన్నారు. కనుక వీటి ద్వారా కూడా మనం డయాబెటిస్ అని చెప్పవచ్చు. అలానే ఏమైనా తిన్నప్పుడు కానీ నమిలినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ కష్టంగా అనిపించడం కూడా ఒక లక్షణం.

అయితే నోరు ఆరిపోవడం కారణంగా పంటి చుట్టూ ఉండే ప్రదేశంలో మరియు దంతాల కింద కూడా పొడిగా ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం కారణంగా క్రిములు మరియు పాచి మొదలు అవుతుంది. దీని వల్ల దంతాలు ఎఫెక్ట్ అవుతాయి. పుచ్చి పళ్ళు, పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలు దీని కారణంగా వస్తాయి.

డయాబెటిస్ ఎక్కువగా ఉండే వాళ్లలో ఈ లక్షణాల్ని కూడా మనం గమనించవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా పళ్లు ఊడిపోవడం, పళ్ళు పుచ్చి పోవడము కారణంగా షుగర్ లెవల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయని కంట్రోల్ చేయలేకపోతున్నారని అర్థం.

అంతే కాదు కొన్ని కొన్ని సార్లు దంతాలు నుండి రక్తం కారడం, దంతాలు ఎర్రగా ఉండడం, పళ్ళు ఊడిపోవడం, ఏమైనా కొరికినప్పుడు మార్పు కనిపించడం, చెడు శ్వాస లేదా రుచి తెలియకపోవడం లాంటి సమస్యలు కూడా ఉండొచ్చని వైద్యులు అంటున్నారు.

డయాబెటిస్ ఎక్కువగా ఉండే వాళ్లలో పళ్ళు ఊడిపోతాయి అని డాక్టర్లు చెబుతున్నారు. పాచి మొదలవ్వడం కారణంగా పంటికి గ్రిప్ ఉండకపోవడంతో పళ్ళు ఊడిపోతాయి.రీసెర్చ్ ప్రకారం ఇతర సమస్యలతో బాధపడే వాళ్ళ కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ డయాబెటిస్ వారికి ఊడిపోతాయి అని తెలుస్తోంది. పెద్దవాళ్ళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

అదే విధంగా ఓరల్ హెల్త్ సరిగా పాటించకపోయినా సరే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పళ్ళు నొప్పి కలగడం, పళ్ళు ఊడిపోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు అని అన్నారు.మనం కనుక ఓరల్ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌కి చెక్ పెట్టాలి అంటే డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అదే విధంగా డెంటిస్ట్‌ని కూడా కన్సల్ట్ చేస్తూ ఉండాలి.

సాధారణంగా డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు కంటి ఆరోగ్యం, పాదాల ఆరోగ్యం పైన ఫోకస్ పెడతారు. కానీ డెంటల్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చూశారు కదా డయాబెటిస్ వల్ల ఎటువంటి లక్షణాలు కనబడతాయి అని.. కాబట్టి ఈ లక్షణాలని మీరు కూడా గుర్తించి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి తెలుసుకోండి. దీంతో పాటుగా మంచి ఓరల్ హైజీన్ ని పాటించడం. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం, డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయడం వంటి వాటిని పట్టించుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.