జూలై 31 వరకు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్

Digital india campaign

ఆన్‌లైన్ లావాదేవీలు, సేవలను విస్తృతం చేసేందుకు ఉద్ధేశించిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పలుశాఖల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ కార్యక్రమాలను ప్రొత్సహించేందుకు గాను నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెల్, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ విభాగం సహా కేంద్ర ప్రభుత్వశాఖల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్‌శాఖ ప్రవేశపెట్టిన పలు పథకాలకు విస్త్రత ప్రచారాన్ని కల్పిస్తున్నట్లు హైదరాబాద్ జనరల్ పోస్టాపీస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జయరాజు తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పలుశాఖల అధికారులకు అందుబాటులో ఉన్న పథకాలపై ఆయన అవగాహన కల్పించారు.