వేరే భాషా చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు…!

Dil Raju Strong Counter To Ashok Vallabhaneni Comments

సంక్రాంతికి విడుదల కానున్న రజనీ కాంత్ ‘పేట’ సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదని ఆ సినిమా తెలుగు హక్కు దారుడు వల్లభనేని అశోక్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ ఆరోపణల మీద ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. అశోక్ తొందరపడి స్టేట్ మెంట్ ఇచ్చారేమోనని, ఇప్పుడు విడుదలవుతున్న 3 తెలుగు సినిమాలూ 6 నెలల క్రితమే రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసుకుంటే వీటికే థియేటర్లు ఎలా సర్దుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటే పక్క రాష్ట్రం నుంచి 20 రోజుల ముందు ఒక సినిమాను కొనుక్కోచ్చేసి సంక్రాంతికి విడుదల చేయాలంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.

డబ్బింగ్ సినిమా ‘సర్కార్’, ‘నవాబ్’ వంటి సినిమాలను ఎన్ని థియేటర్స్ లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకుని ఇప్పుడు దొరకడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తెలుగు సినిమాలను తగ్గించుకుని పర భాషా చిత్రాలకు థియేటర్లిచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు తేల్చేశారు. ‘పేట’ సినిమాను 18న రిలీజ్ చేస్తే, రెండు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయని, ఈ లాజిక్ ఆలోచించకుండా నోరుజారితే, తామూ విమర్శలకు దిగగలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ తాను చేస్తున్నది కూడా వ్యాపారమేనని, డిస్ట్రిబ్యూషన్ లో ఎంతో నష్టపోయానని, అయినా, సినిమా మీద ఉన్న ఇష్టంతోనే ఈ రంగంలో ఉన్నానని అన్నారు.