ఎంసీఏ విషయంలో దిల్‌రాజు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌

Dil Raju Overconfidence on Nani MCA movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈ సంవత్సరంలో వరుసగా అయిదు సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించి సత్తా చాటిన దిల్‌రాజు 2017లో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రంతో డబుల్‌ హ్యాట్రిక్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ నమ్మకంగా చెప్పాడు. ‘హలో’ చిత్రం విడుదలకు సహకరించి, కాస్త వాయిదా వేయాలని నిర్మాత నాగార్జున స్వయంగా కోరినా కూడా మా సంస్థకు డబుల్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అవుతుందంటూ నాగార్జున మాటను కూడా కాదన్నాడు. క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసి తీరుతాం అంటూ ప్రారంభించిన రోజే ప్రకటించారు. అన్నట్లుగానే సినిమాను విడుదల చేశాడు. అయితే సినిమాపై దిల్‌రాజు పెట్టుకున్నది కాన్ఫిడెన్స్‌ కాదని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ తేలిపోయింది.

తాను ఏ చిత్రాన్ని నిర్మించినా సక్సెస్‌ అయ్యి తీరుతుందని భావించిన దిల్‌రాజు ‘ఎంసీఏ’ చిత్రంపై దృష్టి పెట్టినట్లుగా లేడు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ గతంలోనే ఫ్లాప్‌ను తీశాడు. మళ్లీ ఆయనపై నమ్మకం పెట్టి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో వదిలేశాడు. కాని వేణు శ్రీరామ్‌ మాత్రం చాలా రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా తెరకెక్కించాడు. దాంతో ‘ఎంసీఏ’ ఫలితం తారు మారు అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఎంసీఏ’ చిత్రం సో సోగానే ఉందని, పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. నాని వరుస విజయాలకు ఈ చిత్రంతో బ్రేక్‌ పడ్డట్లయ్యింది. ఈ చిత్రం దిల్‌రాజుకు డబుల్‌ హ్యాట్రిక్‌ను తెచ్చి పెడుతుందని భావిస్తే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.