దిల్‌ రాజు తీస్తోన్న ‘పింక్‌’కి పవన్‌ పారితోషికం నలభై కోట్లు

దిల్‌ రాజు తీస్తోన్న 'పింక్‌'కి పవన్‌ పారితోషికం నలభై కోట్లు

మళ్లీ సినిమా చేయాలా వద్దా అనే మీమాంస నుంచి బయట పడి ఏకంగా మూడు సినిమాలను క్యూలో పెట్టిన పవన్‌కళ్యాణ్‌ కేవలం తన పార్టీని నడిపించుకోవడానికి అవసరమైన డబ్బు కోసమే ఇవి చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలపై పవన్‌కి తక్కువలో తక్కువ వంద కోట్లకి పైగా లభిస్తాయి. దిల్‌ రాజు తీస్తోన్న ‘పింక్‌’కి పవన్‌ పారితోషికమే నలభై కోట్లు. అది కాకుండా లాభాల్లో వాటా కూడా వుంటుంది.

దిల్‌ రాజు ఇచ్చిన పారితోషికంతో ఇంతకుముందు పవన్‌తో మాట్లాడుకున్న నిర్మాతలు కూడా రేటు పెంచక తప్పలేదు. ఏ.ఎం. రత్నం, మైత్రి మూవీ మేకర్స్‌ చిత్రాలకి పారితోషికంగా పవన్‌ చెరో ముప్పయ్‌ కోట్లు ఛార్జ్‌ చేస్తాడు. అది కూడా ఈ చిత్రాలు ఎప్పుడో ఓకే అయినవి కావడంతో తన రెమ్యూనరేషన్‌ పరంగా కాస్త రిబేట్‌ ఇచ్చాడు. అయితే సినిమాల అమ్మకాలలో నిర్మాతలకి మిగిలితే కనుక అందులో పవన్‌కి ఇద్దరు నిర్మాతలు వాటాలు ఇవ్వక తప్పదు.

ఈ నిర్మాతలందరూ తాను రోజుకి ఆరు గంటల కాల్షీట్లే ఇస్తానని చెప్పినా ఓకే అనేయడం వల్ల పవన్‌కి ఈ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చాలా లాభసాటిగా అనిపిస్తోంది. అందుకే ఇక మీదట రాజకీయంగా తన స్టాటస్‌ ఏదయినా కానీ సినిమాలలో నటించనని మాత్రం పవన్‌ చెప్పడట. తన టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌కి అంగీకరించే నిర్మాతలతోనే సినిమాలు చేస్తానని చెబుతున్నాడట.