రాజుకు నమ్మకం.. నానికి లేదేం?

dil raju speech at krishnarjuna yuddham promotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నేచురల్‌ స్టార్‌ నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించాడు. అయితే పూర్తి నిర్మాతగా కాకుండా నిర్మాణ భాగస్వామిగా దిల్‌రాజు వ్యవహరించాడు. నాని, దిల్‌రాజు కాంబోలో ఇప్పటి వరకు ‘నేను లోకల్‌’ మరియు ‘ఎంసీఏ’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రంతో దిల్‌రాజు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. అయితే నాని మాత్రం ఈ చిత్రంపై అంతగా నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నాడు.

తాజాగా ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం ప్రమోషన్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ నానితో తమ బ్యానర్‌లో హ్యాట్రిక్‌ చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. అయితే నాని మాత్రం వరుసగా చిత్రాలు సక్సెస్‌ అవ్వడం అనేది మన చేతిలో లేదని, అన్ని సక్సెస్‌లు రావాలి అంటే ఎలా అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు చూస్తుంటే ఈ చిత్రం కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.