శ్రీ రెడ్డి కి ఊహంచని మద్దతు

Gali Vinod Kumar Support Sri Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ లో తెలుగు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, తనకు మా మెంబర్ షిప్ ఇవ్వనందుకు గాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్సన చేసిన శ్రీ రెడ్డి కి ఇండస్ట్రీ వర్గాల వ్యతిరేకత వ్యక్తం అవుతోంటే బయటి నుండి మాత్రం ఆమెకి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ఇండస్ట్రీ లోని అన్ని వర్గాల వారు మాత్రం ఆమె చేసిన పనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఆమెది దిగజారుడు చర్య గా భావిస్తున్నారు.

తాజాగా ఆమెకు ఇండస్ట్రీ యేతర వర్గాల నుండి మాత్రం ఊహించని మద్దతు లభించింది. శ్రీరెడ్డికి తాము మద్దతుగా ఉంటామని సౌత్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రకటించారు. జేఏసీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణాది సినిమాలలో ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం వల్ల… దక్షిణాది హీరోయిన్లు నష్ట పోతున్నారని ఆయన తెలిపారు. దక్షిణాది తారల పట్ల సినీ నిర్మాతలు, ఇతరులు ఇదే విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో సినిమాల ప్రదర్సనలని సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు.