ఎన్టీఆర్‌, అట్లీ కథ కంచికి

director-atlee-kumar--says-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు స్టార్‌ హీరోలు ఎక్కువగా తమిళ దర్శకులపై నమ్మకంను ఉంచుతారు. వరుసగా ఫ్లాప్‌లు పడుతున్నప్పుడు తప్పకుండా తమిళ దర్శకులు తమను నిలబెడుతారు అని గతంలో పలువురు స్టార్‌ హీరోలు నమ్మి తమిళ దర్శకుతో సినిమాలు చేసిన సందర్బాలు ఉన్నాయి. తమిళ దర్శకులు ఎంతో మంది తెలుగులో డైరెక్ట్‌ చిత్రాలను చేయడం జరిగింది. తెలుగులో ఇంకా పలువురు తమిళ దర్శకులు చిత్రాలు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా తమిళ యువ దర్శకుడు అట్లీతో ఎన్టీఆర్‌ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు అంటూ వర్తాలు వచ్చాయి. తమిళంలో వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న అట్లీపై ఎన్టీఆర్‌ మనసు పారేసుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

తమిళ దర్శకుడు అట్లీ తాజాగా తెలుగులో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఆమద్య ఎన్టీఆర్‌ మరియు మహేష్‌లకు కథలు వినిపించినట్లుగా మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తనకు తెలుగులో ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన లేదని,తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా ఇప్పుడు కాదని చెప్పేశాను అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబు అంటే ఇష్టం అని భవిష్యత్తులో అవకాశం వస్తే సినిమా చేస్తానే మో అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. దాంతో అట్లీ, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ అంటూ వచ్చిన వార్తలు పుకార్లే అని, ఆ సినిమా కథ కంచికి పోవాల్సిందే అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.