మహాత్ముడి సాక్షిగా ఎంపీల నిర‌స‌న‌లు, కేజ్రీవాల్ మద్దతు…

TDP MP's Silent Protest at Raj Ghat For AP Special Status

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం ప్రస్తుతం రాష్ట్రంలో నిరసనలు రోజు రోజుకూ ఉధృతమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాక దేశ రాజధాని ఢిల్లీ లో కూడా అధికార-ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దీక్షలకి దిగారు. వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా టీడీపీ ఎంపీ లు కూడా తమ నిరసనను తీవ్రతరం చేశారు. మొట్టమొదటగా పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టిన టీడీపీ ఎంపీలు ఢిల్లీ లోని ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడికి యత్నించారు. పోలిస్ లు వారిని అరెస్ట్ చేసి బస్సులో తరలించి… తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేరుగా పీఎస్‌కు వెళ్లారు. 
అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన… వారికి సంఘీభావాన్ని తెలిపారు. కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు కేజ్రీ. అంతే కాక విభజన హామీలు కూడా నెరవేర్చాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన టీడీపీ ఎంపిలను ఈ విషంగా అరెస్టులు చేయడం తగదని ఆయన బిజెపి ప్రభుత్వ తీరుని ఖండించారు. అయితే ఎంపీలని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేశారు 

 kejriwal went to police station to release TDP MP's

ఇవాళ ఎంపీలు మ‌హాత్మాగాంధీ స‌మాధి రాజ్ ఘాట్ వ‌ద్ద శాంతియుత నిర‌స‌న చేప‌ట్టారు. తొలుత ఎంపీ తోట న‌ర్సింహం నివాసంలో స‌మావేశ‌మైన ఎంపీలు అక్క‌డి నుంచి ప్ర‌త్యేక బ‌స్సులో నేరుగా రాజ్ ఘాట్ వెళ్లారు. జాతిపిత‌కు నివాళుల‌ర్పించిన అనంత‌రం ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు శాంతియుత మార్గంలో నిర‌స‌న చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేసి ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించి తీరుతామ‌ని, ఎంపీ గ‌ల్లా జ‌య్ దేవ్ చెప్పారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీలేని పోరాటం చేస్తామ‌ని, శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తామ‌ని తెలిపారు. అవిశ్వాస‌తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్ట‌కుండా కేంద్రం పారిపోయింద‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌ష్టాన్ని పూడ్చే బాధ్య‌త కేంద్రానిదే అని ఎంపీ సుజ‌నా చౌద‌రి తేల్చిచెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేప‌ట్టిన శాంతియుత పోరాట‌బాట‌లోనే తామూ పోరాడ‌తామ‌ని తెలిపారు. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాలు ద‌క్కేవ‌ర‌కూ పోరుబాట విడిచిపెట్టేది లేద‌ని స్ప‌ష్టంచేశారు. ప్ర‌జాస్వామ్యానికి త‌లవంపులు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఎంపీ అశోక గ‌జ‌ప‌తి రాజు మండిప‌డ్డారు. ప్ర‌ధానిని క‌లిసేందుకు వెళ్తే పోలీస్ స్టేష‌న్ లో పెట్టిస్తారా అని ప్ర‌శ్నించారు. దేశ‌మంటే మ‌ట్టికాదోయ్..దేశ‌మంటే మ‌నుషులోయ్ అని కేంద్రం గుర్తించాల‌ని, రాష్ట్రాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌బ‌బు కాద‌ని హిత‌వుప‌లికారు.