జగన్ కు జేసీ అదిరే సవాల్ : స్వీకరిస్తే ప్లస్ లేపోతే మైనస్సే

JC Diwakar Reddy Challenges Jagan Over Rajya Sabha MP's Resignation

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జేసీ దివాకర్ రెడ్డి, రాజకేయాల్లో ఈయనది ప్రత్యేక శైలి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే విలేఖరులకి ఫుల్ స్టఫ్ దొరుకుతుంది ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి మరి, సీరియస్ ఇష్యూ ని కూల్ చేయడం, కూల్ ఇష్యూ ని సీరియస్ చేయడంలోనూ ఆయన దిట్ట. కాంగ్రెస్ నుండి ప్రజా జీవితం మొదలుపెట్టిన ఆయన తదుపరి పరిణామాల వల్ల తెదేపా గూటికి చేరారు. దీంతో ఒకప్పుడు వైఎస్ కి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన అదే వైఎస్ కుమారుడు జగన్‌ మీద పోరాడాల్సిన పరిస్థితి. అయినా ఎక్కడా తగ్గకుండా జగన్‌ మీద విరుచుకు పడుతుంటారు ఆయన. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ ఆందోళన మరింత తీవ్రతరం చేసి నిన్న ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించారు అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా టీడీపీ ఎంపీలు ఈరోజు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించి ప్రత్యేక హోదా సాధన కోసం శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈక్రమంలో పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. వారితో పాటు మీడియాతో మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్‌ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయించామని చెబుతున్న జగన్‌ రాజ్యసభలో ఉన్న ఇద్దరు ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని ఆయన లాజిక్ తో కూడిన సవాల్‌ విసిరాడు.

ఎప్పుడు వచ్చే లాంటి సవాల్ అయినా ఇది ఇప్పుడు జగన్‌ కి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే హోదా సాధనే తమ లక్ష్యం అని తమ లోక్ సభ ఎంపీలని నిరాహార దీక్షకి దింపిన ఆయన తమ రాజ్య సభ ఎంపీలతో మాత్రం మాతనయినా మాట్లాడించడంలేదు, ఈ విధంగా చూస్తే జగన్‌ ఏదో మొక్కుబడిగా మాత్రమే హోదా పోరాటం చేస్తున్నట్టు జనాల్లోకి వెళ్ళే అవకాసం ఉంది. జేసీ జగన్ ని టైం చూసి కరెక్ట్ గా దెబ్బ కొట్టాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవాల్ ని జగన్ స్వీకరిస్తే ఆయనకీ ఇది ప్లస్ అవుతుంది లేదంటే మైనస్ అవుతుంది. చూడాలి ఏ వైపు వారికి ఈ సవాల్ ప్లస్ అవుతుందో.