ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాఘ‌వేంద్ర‌రావు మొక్కు

Raghavendra Rao Removes Beard About AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాఘ‌వేంద్ర‌రావు అన‌గానే..సినిమాల‌తో పాటు ఆయ‌న ఆహార్యమూ గుర్తొస్తుంది. రాఘ‌వేంద్రరావు ఎప్పుడూ గ‌డ్డంతోనే క‌నిపిస్తుంటారు. ఆయ‌న్ను గ‌డ్డంలేకుండా ఎవ‌రూ చూసిఉండ‌రు. షూటింగుల్లోనూ ఎప్పుడూ ఆయ‌న గ‌డ్డంతోనే ఉంటారు. గ‌డ్డం ఆయ‌న‌కు సెంటిమెంట్ అని కూడా చెప్తుంటారు. షూటింగ్ మొద‌లు పెట్టిన‌ప్పుడు గడ్డం పెంచ‌డం ప్రారంభించి..షూటింగ్ ముగిసిన త‌ర్వాత గ‌డ్డం తీసేస్తార‌ని…ఇలా చేస్తే సినిమా హిట్ట‌వుతుంద‌న్న‌ది ఆయ‌న న‌మ్మ‌క‌మ‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలో ఉంది. గ‌తంలో అయితే వ‌రుస సినిమాలు చేసేవారు కాబ‌ట్టి..ఆ సెంటిమెంట్ దృష్ట్యా ఆయ‌న గ‌డ్డం తీయ‌లేరు. ఇప్పుడ‌లా కాదు…ఈ మ‌ధ్య ఆయ‌న సినిమాలేమీ చేయ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ..గ‌డ్డం లేకుండా క‌నిపించ‌రు. అలాంటి రాఘ‌వేంద్రరావు…ఇప్పుడు క్లీన్ షేవ్ తో మీడియా ముందుకు వ‌చ్చారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని కోరుకుంటూ త‌న గ‌డ్డాన్ని తిరుమ‌ల స్వామివారికి మొక్కుగా చెల్లించుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. ఈ ఉద‌యం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నంలో రాఘ‌వేంద్ర‌రావు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం త‌న గ‌డ్డం మొక్కు కింద చెల్లించాన‌ని తెలిపారు. గత 40 ఏళ్లగా ఏటా ఇలా స్వామివారికి మొక్కు చెల్లిస్లున్నాన‌ని..ఈ సారి ప్ర‌త్యేక హోదా కోరిక కోరుకున్నాన‌ని చెప్పారు. ఏపీకి చేసిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చాల‌ని ప్ర‌ధాని మోడీని డిమాండ్ చేశారు. త్వ‌రలో రాష్ట్ర ప్ర‌జ‌లు శుభ‌వార్త వింటార‌ని రాఘ‌వేంద్ర‌రావు చెప్పారు.