15 కోట్ల ఆఫర్‌.. ఇప్పుడొద్దన్నాడట!

Director Koratala Siva Rejects Nagarjuna Offer For Akhil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ సక్సెస్‌ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. మొదటి రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చడంతో మూడవ సినిమాతో అయినా కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుని స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ కూడా అఖిల్‌ను స్టార్‌గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలోనే అఖిల్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేయాల్సిందిగా అక్కినేని ఫ్యామిలీ నుండి కొరటాల శివకు విజ్ఞప్తి వెళ్లింది. 15 కోట్ల పారితోషికం కూడా ఆఫర్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అవ్వగానే అఖిల్‌ మూడవ సినిమాను చేయాల్సిందిగా కొరటాలను అక్కినేని కుటుంబ సన్నిహితులు కోరడం జరిగింది. కాని అందుకు కొరటాల శివ తిరష్కారం తెలిపినట్లుగా తెలుస్తోంది.

అఖిల్‌తో సినిమా చేయాలని తనకు కూడా ఉందని, ప్రస్తుతం తాను ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు కమిట్‌మెంట్‌ ఇచ్చాను అని, వాటిని పూర్తి చేసే వరకు అఖిల్‌తో సినిమాను చేయలేను అని, భవిష్యత్తులో అఖిల్‌తో తప్పకుండా సినిమా చేస్తాను అంటూ కొరటాల వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేస్తున్న కొరటాల శివ ఇప్పటి వరకు తదుపరి సినిమా ఎవరితో అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆయనే తర్వాత సినిమాను నిర్ణయించుకోలేదు.

భరత్‌ అను నేను పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత ఆ విషయాన్ని కొరటాల శివ ఆలోచిస్తాడు. కాని అక్కినేని వారికి మాత్రం కమిట్‌మెంట్స్‌ ఉన్నాయంటూ చెప్పాడు. దాంతో అఖిల్‌ మూవీని తప్పించుకోవడానికి కొరటాల అబద్దం ఆడి ఉంటాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌కు స్టార్‌డం వచ్చిన తర్వాత కొరటాల శివ ఆయనతో చేయాలనుకుంటున్నాడేమో అని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి బిగ్‌ ఆఫర్‌ను కొరటాల కాదని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు.