మహానటి ఇప్పట్లో లేనట్లేనా?

Mahanati movie may postpone again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు వారు ఎప్పటికి గుర్తుంచుకునే నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, ప్రకాష్‌ రాజ్‌, షాలిని పాండే ఇలా ఎంతో మంది స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అశ్వినీదత్‌ చెబుతూ వస్తున్నాడు. సినిమా టీజర్‌ మరియు పోస్టర్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

మొదటి నుండి కూడా ఈ చిత్రాన్ని మార్చి చివర్లో విడుదల చేస్తామని నిర్మాత మరియు దర్శకుడు చెబుతూ వచ్చారు. మార్చి నెల మరో పది రోజుల్లో ముగియబోతున్న నేపథ్యంలో కూడా ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటూనే ఉంది. అంటే ఇప్పటికే మార్చిలో ఈ చిత్రం విడుదల కాదని తేలిపోయింది. ఇక ఏప్రిల్‌ లేదా మేలో అయినా ఈ చిత్రం విడుదల అవుతుందా అంటే కష్టమే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నీళ్లు నములుతున్నారు. ఎందుకంటే చిత్రీకరణ ఇంకా చాలా ఉందని, కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందుకే ఈ చిత్రం ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదని అంటున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.