బాలీవుడ్ వెళ్తానంటున్న దర్శకుడు…!

Antariksham Movie Box Office Collection

రానా ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఘాజి. తెలుగులో ఆ చిత్రం మంచి విజయం ను దక్కించుకుంది. తమిళం, హింది లో ను ప్రేక్షకులను ఆకటుకున్నది. నేషనల్ అవార్డు కూడా ఈ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రం తరువాత బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలో ఆఫర్స్ వచ్చాయి అంట కానీ సంకల్ప్ రెడ్డి మాత్రం మరల తెలుగులోనే సినిమాను చెయ్యాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే వరున్ తేజ్ ముఖ్య పాత్రలో అంతరిక్షం 9000 KMPH అనే సినిమాను తీశాడు. ఈ చిత్రంను హింది, తమిళం వర్షన్స్ లో తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

Director-Sankalp-Reddy

అంతరిక్షం సినిమా నుండి విడుదలైన టిజర్, ట్రైలర్ విడుదల చేసి అందరిని ఒక్కింత ఆలోచనలో పడేశాడు. నిజంగానే స్పేస్ ఇలాగే ఉంటుంది అనే విధంగా గ్రాఫిక్స్ వర్క్ విజువల్ వర్క్స్ అలాగా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలై మొదటి రోజు మంచి టాక్ కానీ సంపాదించుకుంటే సంకల్ప్  రెడ్డి పేరు మార్మోగడం ఖాయం అంటున్నారు సినిమా విశ్లేషకులు. అంతరిక్షం చిత్రం పేపర్ లో వచ్చిన స్పేస్ ఆర్టికల్ చూసి ఇంప్రెస్స్ అయ్యి ఈ చిత్రంను తీశాను అంతే తప్ప హాలీవుడ్ సినిమాలు గ్రావిటీ, ఇంటర్ స్తేల్లర్ సినిమాలతో అంతరిక్షం సినిమాకు పోలిక ఉండదని సంకల్ప్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రంలో అదితి హైదరి, లావణ్య త్రిపాటి కథానాయకలుగా నటిస్తున్నారు ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో విడుదలకు సిద్దం అవ్వుతున్నది.