భారతీయుడు సినిమా షూటింగ్‌లో శంకర్ కి తప్పిన పెద్ద ప్రమాదం

భారతీయుడు సినిమా షూటింగ్‌లో శంకర్ కి తప్పిన పెద్ద ప్రమాదం

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి తాజా చిత్రం భారతీయుడు. కాగా ఈ సినిమాకి సంబందించిన చిత్రీకరణ ప్రస్తుతానికి చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ చిత్ర షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. కాగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరొక 10 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు.

గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కి పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం జరిగే ప్రదేశంలో కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న దర్శకుడు శంకర్ కి పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం.

కాగా గతంలో కమల్ హాసన్, శంకర్ ల కలయికలో వచ్చిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ కథానాయికలుగా కనిపించనున్నారు. అయితే ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి చెన్నైలో జరుగుతుంది. కాగా ఇప్పటికే చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం మరిన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం చైనా, థాయ్‌లాండ్‌ వెళ్లనున్నారని సమాచారం.