ట్రంప్‌కు తిరుగులేని ఆతిధ్యం ఇవ్వాలనుకుంటున్నమోడీ

ట్రంప్‌కు తిరుగులేని ఆతిధ్యం ఇవ్వాలనుకుంటున్నమోడీ

వాణిజ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా… మోడీ మాత్రం.. ట్రంప్‌కు.. తిరుగులేని ఆతిధ్యం ఇవ్వాలనుకుంటున్నారు. తాను అమెరికా వెళ్లినప్పుడు.. ఇండియన్ అధికారులతో హౌడీమోడీ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ట్రంప్ హాజరయ్యారు. ఇప్పుడు.. ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన హౌడీమోడీ తరహాలో.. ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి నమస్తే ట్రంప్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంతోనే.. దాదాపుగా ఎనిమిది వందల కోట్లు వెచ్చించి నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ప్రారంభిస్తున్నారు.

కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌ ఎంసీజీ.. ఈ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్షకుల సంఖ్య ల‌క్ష దాటుతోంది. వరల్డ్‌ క్రికెట్‌లో ఎంసీజీ, ఈడెన్‌ గార్డెన్స్‌ బిగ్గెస్ట్ స్టేడియాలు రికార్డులకు ఎక్కాయి. ముఖ్యంగా ఎంసీజీ టాప్‌లో ఉంది. అయితే ఆ సంఖ్యను దాటేసేందుకు కొత్త స్టేడియం ఇండియాలో త‌యారైంది. అదే అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక హంగులతో మెగా స్టేడియంగా రూపుదిద్దుకుంది. ఇండియా పర్యటనకు వస్తున్నఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించ‌నున్నారు. 24వ తేదీన ట్రంప్‌, మోదీలు ఈ స్టేడియాన్ని ఆవిష్కరిస్తారు.

నమస్తే ట్రంప్ ఈవెంట్‌కు మాత్రం సుమారు ల‌క్షా 25 వేల మంది హాజ‌రుకానున్నారు. పాపుల‌ర్‌ ఆర్కిటెక్చర్ సంస్థ ఈ స్టేడియాన్ని డిజైన్ చేసింది.నిర్మాణం కోసం సుమారు 800 కోట్లు ఖ‌ర్చు చేశారు.మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ స్టేడియం కెపాసిటీ ల‌క్షా 24 సీట్లు….. ఇప్పుడు ఆ సంఖ్యను మొతెరా దాటేస్తుంది. మొతెరాలో ప్రధాన క్రికెట్ మైదానంతో పాటు మ‌రో రెండు క్రికెట్ గ్రౌండ్లు ఉంటాయి.,స్డేడియంలో ఓ ఎంట్రీ వ‌ద్దకు మెట్రో రైలు వస్తుంది. ఈ స్టేడియంలోనే.. మొదటగా.. ట్రంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.