శంకర్‌ మూవీలో తెలుగు కమెడియన్‌

Director Shankar's Next Movie Comedian In Vennela Kishore

‘2.0’ చిత్రం ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దర్శకుడు శంకర్‌ ఆ వెంటనే కమల్‌ హాసన్‌ తో ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు. ఈ చిత్రంపై బాలీవుడ్‌ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ను విలన్‌గా నటింపజేస్తున్నాడు. హిందీ, తెలుగు, మలయాళం నుండి కీలక స్టార్స్‌ను ఈ చిత్రంలో ఎంపిక చేయనున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తమిళ సినీ ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీగా బిజినెస్‌ చేసే ఉద్దేశ్యంతో శంకర్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్‌ కమెడియన్‌ నటించబోతున్నాడు.

comedian vennela kishore And Shankar

తెలుగులో ప్రస్తుతం ప్రతి స్టార్‌ హీరో సినిమాలో కూడా కనిపిస్తున్న వెన్నెల కిషోర్‌ ఈ చిత్రంలో నటించబోతున్నాడట. ‘ఇండియన్‌ 2’ చిత్రంలో వెన్నెల కిషోర్‌ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చింది. వెన్నెల కిషోర్‌ ఈ విషయాన్ని అధికారికంగా ఒప్పుకోలేదు. కాని సన్నిహితుల వద్ద మాత్రం అవును అంటూ సమాధానం చెప్పాడట. శంకర్‌ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని సూచించాడని, అందుకే అధికారికంగా ఎవరికి చెప్పడం లేదని తెలుస్తోంది. శంకర్‌ మూవీలో అవకాశం రావడం అంటే అద్బుతమే. శంకర్‌ మూవీ చేసిన తర్వాత వెన్నెల కిషోర్‌ స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇండియన్‌ 2’ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.