తేజ నోరు జారాడా?

Director Teja Tongue Slip On NTR Biopic Movie Release Date On Dasara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి తారక రామారావు జీవిత ఆధారంగా బాలకృష్ణ నటిస్తూ, నిర్మించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’ చిత్రం నేడు లాంచనంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. సాయి కొర్రపాటి, విష్ణులు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ చిత్రం గురించి కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ 2019 సంక్రాంతికి ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ ప్రకటించాడు. జూన్‌ లేదా జులైలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని, సంక్రాంతికి సినిమాను తీసుకు వచ్చేలా చిత్రీకరణ జరుపుతామని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. కాని నేడు చిత్ర ప్రారంభోత్సవంలో తేజ మాట్లాడుతూ షాకింగ్‌గా దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తాని ప్రకటించాడు. 

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. వెంకీ చిత్రాన్ని పూర్తి చేసేందుకు కనీసం మూడు నాలుగు నెలలు అయినా తేజకు పడుతుంది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తేజ మొదలు పెట్టే అవకాశాలున్నాయి. అలా జరిగితే దసరాకు విడుదల అయ్యే ఛాన్స్‌ లేదు. దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ తేజ ప్రకటించడం నోరు జారడమే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. 

దసరాకు చిత్రం విడుదల దాదాపు అసాధ్యం అని నందమూరి అభిమానులు చెబుతున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని బాలయ్య ప్రకటించిన నేపథ్యంలో తేజ వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కొందరు మాత్రం ఎన్టీఆర్‌ చిత్రం ప్లాన్‌ మార్చి వేసి దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ దసరాకే ఈ చిత్రం విడుదల అయితే సూపర్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద సినిమాను విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు కదా మరి.