కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ

Dissent in Congress party in Karnataka state
Dissent in Congress party in Karnataka state

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఎవ్వరూ అనే విషయం కొద్ది రోజుల పాటు చర్చలు జరిగిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. ఇక ఆ తరువాత కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నప్పటికీ. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ తాకిందనే చెప్పాలి.

కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించాడు కాంగ్రెస్ మంత్రి. కర్ణాటక లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన వారసులకు టికెట్ ఇవ్వట్లేదని ఆగ్రహించిన కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలీ, 20 ఎమ్మెల్యేలను తీసుకొని క్యాంప్ రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఈ విషయం తెలిసిన రణదీప్ సుర్జేవాలా వెంటనే అప్రమత్తమై సతీష్ జర్కిహోలీకి నచ్చజెప్పారు. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త కర్ణాటకలో సంచలనాన్ని సృష్టించింది.