కింగ్ నాగార్జున కి జోడీగా కన్నడ భామ ఫిక్స్ ?

కింగ్ నాగార్జున కి జోడీగా కన్నడ భామ ఫిక్స్ ?
Cinema News

కింగ్ అక్కినేని నాగార్జున ఓవైపు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తూ మరోవైపు మూవీలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాని యువ దర్శకుడు విజయ్ బిన్నీతో చేయడానికి సిద్ధం అయ్యారు నాగార్జున. నా సామిరంగ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

కింగ్ నాగార్జున కి జోడీగా కన్నడ భామ ఫిక్స్ ?
Nagarjuna “: Naa Saami Ranga “

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మించనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన మేకర్స్, ఫైనల్ గా కన్నడ భామ ఆషిక రంగనాథ్ ని ఎంపిక చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ . ఇక ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీలో హీరోయిన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఆషిక. అలానే ఈ సినిమా లో మరొక హీరోయిన్ రోల్ కూడా ఉందని, కాగా అందుకోసం మరొక హీరోయిన్ ని కూడా ఎంపిక చేసే పనిలో ప్రస్తుతం టీమ్ ఉందని అంటున్నారు. కాగా నా సామిరంగ సినిమా లో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడికానుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.