స్విగ్గీ డెలివరీ బాయ్స్‌కు శాలరీ ఎలా ఉంటుందో తెలుసా..?

స్విగ్గీ, జొమాటో లేకపోతే అసలు మన పరిస్థితి ఏంటి అని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు ..! ఓపిక లేక, ఇంట్లో వండుకునేవి మనకి నచ్చక, టైమ్‌ లేక చాలా మంది ఆన్‌లైన్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌ లు చేసుకుంటున్నారు. ఇంటి దగ్గరే ఉండి మనం ఆర్డర్‌ పెడితే.. క్షణాల్లో మనకు కావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయి . నగరాల్లో ఉండే యువత పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కోసం ర్యాపిడో, ఓలాలో జాయిన్‌ అవడమో, లేక స్విగ్గీ, జొమాటాలో చేరడమో చేస్తున్నారు చాలా మంది . మనం ఆర్డర్‌చేస్తే మన ఇంటికి తెచ్చి ఇస్తారు.. వీళ్లకు శాలరీలు ఎలా ఉంటాయో తెలుసా..? అసలు సగటున ఒక స్విగ్గీ బాయ్‌ నెలకు ఎంత సంపాదిస్తుంటాడు..? ఇవన్నీ మనకు ఎందుకు మాష్టారు అంటారేమో.. తెలుసుకోవాలండీ..! మన లైఫ్‌లో వాళ్లు కూడా ఒక పార్ట్‌ అయిపోయారు జస్ట్‌ ఫర్‌ నాలెడ్జ్‌ వాళ్ల జీతం ఎంత ఉంటుందో తెలుసుకుందాం .

స్విగ్గీ డెలివరీ బాయ్స్‌కు శాలరీ ఎలా ఉంటుందో తెలుసా..?
Swiggy, Zomato delivery Boys

ప్రస్తుతం అనేక ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో స్విగ్గీ కూడా ఒకటి. ఇందులో డెలివరీ బాయ్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి పనివేళలు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మొత్తం పని గంటలు 5 గంటల 25 నిముషాల వరకు ఫుడ్ ఆర్డర్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.
15 ఆర్డర్లకు 750 రూపాయలు, 20 ఆర్డర్లకు 1100 రూపాయలు, 25 ఆర్డర్లకు 1500 రూపాయలు, 32 ఆర్డర్లు డెలివరీ చేసినట్లయితే 2000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు . ఎన్ని ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేస్తే అంత ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చంట .

సాధారణంగా స్విగ్గి పార్ట్ టైమ్ ఉద్యోగాల చేసేవారి జీతం రూ. 7000-15,000 వరకు ఉంటుందని మనకి తెలుస్తుంది .ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్‌ ఉద్యోగాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది . దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునే వారికి , వారి అనుకూలమైన సమయాలలో చేసే అవకాశం ఉండడంతో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్‌ జాబ్ వైపుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు .