బాలయ్య సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

బాలయ్య సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
Cinema News

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఐతే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పై తాజాగా ఒక రూమర్ వినిపిస్తోంది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా త్రిష ను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది . ఇక మరో హీరోయిన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ హీరోయిన్ పాత్రకు కథలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది . ఈ పాత్రలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని ఇప్పటికే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

బాలయ్య సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
BalaKrishana

ఏది ఏమైనా బాలయ్య బాబు – మీనాక్షి చౌదరి – త్రిష కాంబినేషన్ అంటే అదిరిపోతుంది. ఇక ఈ మూవీ లోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. అన్నట్టు ఈ మూవీ బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ మూవీ లో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.