అట్లీస్ తెలుగు సినిమా…..!

అట్లీస్ తెలుగు సినిమా.....!
Atlee

షారుఖ్ ఖాన్ – నయనతార నటించిన బాలీవుడ్ సినిమా జవాన్‌ తో దర్శకుడు అట్లీ కుమార్ పేరు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోయింది. భారీ స్థాయిలోనే జవాన్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఐతే, రీసెంట్ గా సినిమా నిర్మాణంలో తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ, అట్లీ తన ‘ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్’ బ్యానర్‌లో 4 చిత్రాలను నిర్మించబోతున్నట్లు అట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అట్లీ తన నిర్మాణంలో ‘తేరి’ సినిమాని బాలీవుడ్ రీమేక్‌ గా చేయబోతున్నాడు. అలాగే, అట్లీ తెలుగులో ఒక సినిమాని, మరియు రెండు తమిళ సినిమా లను కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.

అట్లీస్ తెలుగు సినిమా.....!
Atlee

ఇక అట్లీ తన తర్వాత సినిమా పై దృష్టి పెట్టాడు. ఆ మధ్య తనకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని అట్లీ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ.. “నేను స్పానిష్ సినిమా చేయవచ్చు. వారు (హాలీవుడ్ వారు) నాకు కాల్ చేసి.. ఒకవేళ మీరు హాలీవుడ్‍లో పని చేయాలనుకుంటే మాకు చెప్పండి’ అని అడిగారంట . జవాన్ సినిమా వారికి బాగా నచ్చింది. పైగా ఇంతకు ముందు ఇలాంటి సినిమా (జవాన్) చూడలేదనే సరికి నేను దేవుడా అని ఆశ్చర్యపోయాను. ఈ ఐడియా మనకు మాత్రమే పని చేస్తుందని నేను అనుకున్నాను . కానీ గ్లోబల్‍ గా కూడా ఇది వర్కౌట్ అవుతుంది ” అని అట్లీ కామెంట్స్ చేశాడు.