కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు

కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు

కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. కోవిడ్‌ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులున్నాయని.. ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని, పీహెచ్‌సీలు, యుహెచ్‌పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జీజీహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి ఉండాలన్నారు.