యాప్ డౌన్ లోడ్ చేస్తున్నారా గులిగాన్ తో జాగ్రత్త

android-antivirus

Posted [relativedate]

android-antivirusవేల రూపాయ ఖర్చు పెట్టు కొన్న ఫోన్లను మురిపెం గా చూసుకొంటాం అది మామూలే మరి ఆ ఫోన్ సరిగా పని చేయకపొతే ఎలా? ఎందుకు పని చేయ టంలేదో అనే మినిమం ఐడియా కూడా ఉండాలి కదా..మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్లకు వైరస్ వస్తోంది ఇందుకే ఫోన్ లు పనిచేయటం లేదు ..అదేంటో చూద్దాం ఇటీవల ఏమైనా కొత్త యాప్ లు డౌన్ లోడ్ చేస్తే .’గూలిగాన్’ అనే వైరస్ ఫోన్ లో ఇన్స్టాల్ ఐపోతోంది అట .ఈ వైరస్ ఇప్పటికే 13 లక్షల ఫోన్లలోకి చొచ్చుకెళ్లిందట. ఈ వైరస్ ఇన్స్టాల్ కావడం వల్ల జీ మెయిల్, డ్రైవ్, ఫోటోలు, ఇతర సమాచారం, బ్యాంకుల ఖాతాల వివరాలు, యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు తదితర వివరాలన్నీ హ్యాకర్లకు చేరతాయి అట. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర యాప్ స్టోర్ల నుంచి ఏవైనా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేస్తే, ఇలా జరుగుతోందని అమెరికన్ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ హెచ్చరించింది. ‘ట్రోజన్ హార్స్’ వైరస్ మాదిరిగా ఇది దూసుకెళుతోందని, దీంతో జాగ్రత్తగా ఉండాలని ‘ఫోర్బ్స్’ అంటోంది