రాజీనామా చేయను…కావాలంటే సస్పెండ్ చేసుకోండి…!

Ds-Comments-On-KCR-And-TRS
 రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైపోయినట్టే ఉంది. ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తనను సస్పెండ్ చేయాలని, అది చేతకాకుంటే, తనకు వ్యతిరేకంగా చేయించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని డీఎస్ డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు తీర్మానం చేసి, కేసీఆర్ కు పంపారని గుర్తు చేసిన డీఎస్, తన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసునని, తాను ఎవరికీ ద్రోహం చేసింది లేదని చెప్పారు. తనంతట తానుగా తెరాసకి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు డి.శ్రీనివాస్ తేల్చిచెప్పారు. తానే రాజీనామా చేసి వెళితే, తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్లవుతుందని అభిప్రాయపడ్డ ఆయన, కావాలంటే పార్టీ అధిష్ఠానమే తనపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
d-srinivasarao-comments-on-
స్వతంత్రంగా పెరిగిన తన కుమారులు సొంత నిర్ణయాలు తీసుకుంటారని, వారి నిర్ణయాలను తాను అడ్డుకోలేనని డీఎస్ వ్యాఖ్యానించారు. 50 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో మెలిగానని, తెలంగాణ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఎత్తుకోక ముందే తాను ప్రత్యేక తెలంగాణా కోసం సభల్లో వాదించానని అలాంటి తన మీద ఇప్పుడు ఇలా నిందలు వేయడం బాదిస్తోందని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి ధైర్యముంటే తాను ఏం వ్యతిరేక పనులు చేశానో చెప్పాలని సవాల్ విసిరిన ఆయన, మనసులో ఏదో పెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జిల్లా నేతలను విమర్శించారు. రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని డీఎస్ ఆరోపించారు.
ds-kcr