వీర రాఘవుడి జోరుకు గోవిందుడు అడ్డు పడతాడా?

Vijay Devarakonda Nota Treat to NTR Aravinda Sametha Movie

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను మూట కట్టుకోవడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. సోలో రిలీజ్‌ ఈ సినిమాకు మంచి ప్లస్‌ అవ్వనుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అంతకు ముందు వారం అంటే అక్టోబర్‌ 4న విజయ్‌ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ క్రేజ్‌కు స్టార్‌ హీరోలు కూడా కాస్త జంకుతున్నారు.

vijay-deverakonda

‘నోటా’ చిత్రం సక్సెస్‌ అయితే అరవింద సమేత చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం పడటం ఖాయం అని, ఎన్టీఆర్‌ అభిమానులు కోరుకుంటున్న వంద కోట్ల కలెక్షన్స్‌ సాధ్యం కాదేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నోటా’ చిత్రంను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సినిమా పొలిటికల్‌ నేపథ్యంలో తెరకెక్కడంతో పాటు, గీత గోవిందం క్రేజ్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కాబోతుంది. అందుకే ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే అరవింద సమేత చిత్రం జోరుకు విజయ్‌ దేవరకొండ అడ్డు పడ్డట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ntr