వివాదంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో…!

The Rx 100 Hero In The Controversy

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో హీరోగా గుర్తింపు దక్కించుకున్న కార్తికేయ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. కార్తికేయ ఇండస్ట్రీలోఅవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఈ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకుని ప్రస్తుతం సినీ వర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సమయంలోనే కార్తికేయ తనను మోసం చేశాడు అంటూ ఒక నిర్మాత మీడియా ముందుకు రావడం చర్చనీయాంశం అవుతుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంకు ముందు కార్తికేయ ‘సుఫారి’ అనే చిత్రంను చేసేందుకు కమిట్‌ అయ్యాడట. అందుకు సంబంధించిన కొన్ని సీన్స్‌ చిత్రీకరణ కూడా జరపినట్లుగా నిర్మాత చెప్పుకొచ్చాడు.

rx100-movie

తాజాగా కార్తికేయ ‘సుఫారికి’ సంబంధించిన కొన్ని సీన్స్‌ లీక్‌ అవ్వడం జరిగింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో పాటు, నిర్మాత తనను కార్తికేయ మోసం చేశాడు అని, సుఫారి చిత్రం కోసం తనతో ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పుడు సినిమా సక్సెస్‌ అవ్వడంతో తనను దూరంగా ఉంచుతున్నట్లుగా ఆరోపిస్తున్నాడు. అయితే కార్తికేయ మాత్రం సోషల్‌ మీడియాలో ఈ విషయమై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాను డెమో రీల్‌ కోసం చేసిన వీడియోను సినిమా వీడియో అంటూ చెబుతూ నన్ను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సుఫారీ చిత్రంతో తనకు అసలు సంబంధం లేదు అని, నాన్సెన్స్‌ను ఆపేయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

rx100-hero-conterversy