దుప్పట్లో మిన్నాగు టీజర్ !

Duppatlo Minnagu teaser

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దుప్పట్లో మిన్నాగు సినిమాని చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ నిర్మిస్తున్నారు. ‌‌సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కన్నడ కథానాయిక చిరాశ్రీ నటించింది. నవ్య వారపత్రికలో వచ్చిన నవలల పోటీలో రూ.50,000 ప్రథమ‌ బహుమతి గెలిచిన ‘దిండు కింద నల్ల త్రాచు’ నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.‌ ఈ చిత్ర టీజర్‌ ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చేసిన అతిథులను ప్రదర్శించి చూపించారు. 12 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియా‌తో ఈ కథ రాశానని కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అకస్మాత్తుగా తప్పిపోయిన తండ్రిని, ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది? తీవ్రవాదులని ఎలా మట్టుబెట్టిందన్న కథాశంతో రూపొందించిన చిత్రమని యండమూరి అన్నారు. ఉగ్రవాదం నేపధ్యంలో కాస్త ఇంటరెస్టింగ్ గా ఉన్న ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి మరి.