ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీ తగ్గింపు

ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీ తగ్గింపు

ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి పలు ప్రభుత్వాలు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఫేమ్‌-2 విధానానికి సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీగా సబ్సీడిలను అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు మెరుగుపర్చడం కోసం వ్యక్తిగత రాయితీలను ప్రకటించింది.

జాయ్‌ ఈ-బైక్‌పై సబ్సిడీ కార్యక్రమానికి గుజరాత్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజేన్సీ  ఆమోదం తెలిపింది.జాయ్‌ ఈ-బైక్స్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధరలపై సుమారు 12 వేల సబ్సిడీను గుజరాత్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ కేవలం గుజరాత్‌లో చదువుకునే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు వర్తించనుంది. జాయ్‌ ఈ-బైక్స్‌ శ్రేణిలోని జెన్‌ నెక్ట్స్‌, వోల్ఫ్‌, గ్లోబ్‌, మాన్‌స్టర్‌ వేరియంట్‌లకు ఈ సబ్సిడీ లభించనుంది.